
తెలుగు సినీ పరిశ్రమలోకి ఉప్పెన లా దూసుకొచ్చింది ముంబై బ్యూటీ కృతి శెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్ట్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ.

బంగార్రాజు, శ్యాంసింఘరాయ్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత మాత్రం వరుస ప్లాపులను ఖాతాలో వేసుకుంది.

ఇటీవలే కస్టడీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. అక్కినేని నాగచైతన్య నటించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం కృతిశెట్టి పాన్ ఇండియా ఛాన్స్ కొట్టేసింది. మలయాళం హీరో టివినో థామస్ హీరోగా 'జితిన్ లాల్ అజయంతే రందం మోషణం' అనే చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు.

ఇందులో హీరోయిన్లగా కృతిశెట్టిని...ఐశ్వర్య రాజేష్ ని ఎంపిక చేసారు. ఈ సినిమా టైలర్ ని ఇటీవలే నేచురల్ స్టార్ నాని విడుదల చేసారు. మాతృ భాషలో ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.