
ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో థ్రిల్లర్, సస్పెన్స్, క్రైమ్ కథాంశాలకు ప్రేక్షకులలో విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా బ్యాంక్ రాబరీ (దోపిడీ) నేపధ్యంలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరికీ నెట్‌ఫ్లిక్స్ పాపులర్ షో 'మనీ హీస్ట్' గుర్తుకు వస్తుంది. అయితే, ఇప్పుడు దానికి ఏమాత్రం తీసిపోకుండా, మరింత ఉత్కంఠభరితమైన కథనంతో ఒక మలయాళీ సినిమా డిజిటల్ ప్రపంచంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఈసినిమా కథేంటీ..? సరికొత్త కంటెంట్ ఏంటీ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా.

సౌత్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మలయాళ చిత్రం 'ఐ నోబడీ' (I Nobody) ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో నిలిచింది. థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం, ప్రస్తుతం జియో హాట్‌స్టార్ లో ప్రసారమవుతోంది. సుమారు 2 గంటల 46 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులు ఊహించని ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ సినిమా కథ ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి చుట్టూ తిరుగుతుంది. ఎప్పటిలాగే తన రోజువారీ పనిలో నిమగ్నమై ఉన్న ఆ ఉద్యోగి కళ్ల ముందే, ఒక క్రూరమైన , పక్కా ప్రణాళికతో వచ్చిన దోపిడీ దొంగల ముఠా బ్యాంక్‌పై దాడి చేసి కోట్లాది రూపాయల సొమ్మును దోచుకెళ్తుంది.

తన కళ్ల ముందే జరిగిన ఈ ఘోర కలికి ఆ ఉద్యోగి భయపడి వెనకడుగు వేయడు. ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనా సరే, ఆ అట్టల్ దొంగలను పట్టుకోవాలని, బ్యాంక్ నుంచి దోచుకెళ్లిన ప్రతి ఒక్క రూపాయిని తిరిగి రాబట్టాలని గట్టి పట్టుదలతో నిర్ణయించుకుంటాడు. దక్షిణాది అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో సాధారణ బ్యాంక్ ఉద్యోగి పాత్ర నుండి, దొంగలను ఎదుర్కొనే ధైర్యవంతుడిగా రూపాంతరం చెందే క్రమాన్ని ఎంతో శక్తివంతంగా పండించారు. దోపిడీ వెనుక ఉన్న అసలు కారణాలు, పోలీసుల దర్యాప్తు, ప్రధాన పాత్రధారి వేసే వ్యూహాత్మక అడుగులు ప్రేక్షకులలో ప్రతిక్షణం ఉత్కంఠను పెంచుతాయి.

కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, తెలివితో కూడిన రివేంజ్ డ్రామాగా ఈ సినిమా సాగుతుంది. హై-వోల్టేజ్ క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూడటం ఇష్టమైతే, 'ఐ నోబడీ' ఖచ్చితంగా చూడవలసిన చిత్రం. ఒక సామాన్యుడు వ్యవస్థను, నేరస్థులను ఎలా ఎదుర్కొన్నాడో చూపించే ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, హట్ స్టార్ ఓటీటీ ప్రియులలోనూ విపరీతమైన టాక్‌ను సొంతం చేసుకుంటోంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు, హకీం షాజహాన్, అశోకన్, విజయరాఘవన్ కీలకపాత్రలు పోషించారు.

నిషామ్ బషీర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. స్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టి ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తిగా పృథ్వీరాజ్ అద్భుతంగా నటించారు. సినిమా మనీ హీస్ట్ తరహా బ్యాంక్ రాబరీ నేపథ్యంలో సాగుతూ, మంచి సస్పెన్స్, ఎమోషన్స్, పొలిటికల్ సెటైర్ అంశాలతో ఆకట్టుకుంటుంది. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM), సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలిచాయి. సమాజంపై సెటైర్ వేసే కొన్ని సీన్లు, సినిమాలోని లోతైన అర్థాలు సాధారణ ప్రేక్షకులకు అంత త్వరగా కనెక్ట్ అవ్వకపోవచ్చు