24 డిసెంబర్ 1995న భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ కేతిక శర్మ. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లా మార్టినియర్ బాలికల పాఠశాలలో స్కూలింగ్ విద్యను పూర్తిచేసింది ఈ ముద్దుగుమ్మ.
ఢిల్లీ నగరంలో ఉన్న మిరాండా హౌస్, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఈ అందాల తార. చదువు పూర్తయ్యాక మోడలింగ్ లో తన కెరీర్ ను ప్రారంభించింది ఈ వయ్యారి. పలు బ్రాండ్ల ప్రకటనల్లో కనిపించింది.
తన డబ్స్‌మాష్ వీడియో క్లిప్‌ల కారణంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దింతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ అయింది. తర్వాత తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంది ఈ వయ్యారి భామ.
2021లో ఆకాష్ పూరికి జోడిగా రొమాంటిక్ అనే ఓ టాలీవుడ్ సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ. తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా అనే చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. అయితే ఈ రెండు చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్రో సినిమాలో కథానాయకిగా కనిపించింది. దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం శ్రీవిష్ణుకి జోడిగా #సింగల్ సినిమాలో నటిస్తుంది. అలాగే నితిన్ రాబిన్‌హుడ్‌లో స్పెషల్ సాంగ్‌లో అలరించనుంది.