
సౌత్‌లో హోమ్లీ ఇమేజ్ కారణంగానే వెనుకబడిపోయానని భావిస్తున్న కీర్తి సురేష్, బాలీవుడ్ విషయంలో ఆ తప్పు జరగకుండా చూసుకుంటున్నారు. అందుకే డెబ్యూ మూవీలోనే అల్ట్రా గ్లామరస్ లుక్స్‌తో అదరగొడుతున్నారు. బేజీ జాన్ సినిమాతో నార్త్ ఎంట్రీ ఇస్తున్న కీర్తి, ఫస్ట్ సింగిల్‌తోనే అదరగొట్టేశారు.

మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్, స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వటంలో మాత్రం తడబడుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో ఎక్కువగా పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేసినా... అనుకున్న రేంజ్‌లో క్రేజ్ రాలేదు.

లేడీ ఓరియంటెడ్ సినిమాలు వర్కవుట్ కాకపోవటంతో గ్లామర్ టర్న్ తీసుకున్నారు మహానటి. కమర్షియల్ సినిమాలో గ్లామరస్ హీరోయిన్‌గా కనిపించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఫార్ములా వర్కవుట్ అయినా... సౌత్ స్టార్ లీగ్‌లో ప్లేస్ మాత్రం దొరకలేదు. ట్రెండ్‌లో ఉన్న హీరోయిన్లతో పోటి పడేందుకు గ్లామరస్ ఫోటోషూట్స్ కూడా ట్రై చేశారు ఈ బ్యూటీ.

ప్రజెంట్ బాలీవుడ్ డెబ్యూ మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్న కీర్తి సురేష్, నార్త్ ఎంట్రీ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. సౌత్‌లో తన ఇమేజ్ కెరీర్‌కు ఇబ్బందిగా మారటంతో నార్త్‌లో డిఫరెంట్ ఇమేజ్‌తో ఎంట్రీకి రెడీ అవుతున్నారు.

బేజీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కీర్తి సురేష్, ఆ సినిమాలో అల్ట్రా గ్లామరస్‌గా కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని ఫస్ట్ సింగిల్‌తోనే కన్ఫార్మ్ చేశారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన బేబీ జాన్ పాటతో నార్త్ సర్కిల్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు కీర్తి సురేష్.