
తన పెళ్లి గురించి వస్తున్న వార్తలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పింది కీర్తి . ఇప్పట్లో అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే ఉగాది పండుగను తమిళనాడులో పుత్తండు అనే పేరుతో జరుపుకుంటారు. వారికి కూడా అదే రోజు నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.

ప్రస్తుతం కీర్తి.. మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇటీవల నితిన్‌కు జోడీగా రంగ్ దే సినిమాలో నటించింది కీర్తి. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఇవే కాకుండా.. రజినీకాంత్ నటిస్తున్న అన్నాత్తే సినిమాలోనూ కీర్తి సురేష్ నటిస్తుంది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన నేను శైలజ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్.

ఈ మూవీ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో కీర్తి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.

ఈ నేపథ్యంలోనే ఆమె పెళ్లి వార్త ఒకటి కొన్ని రోజులుగా జోరుగా షికారు చేస్తోంది.