సినిమా వాళ్ళు చాలా మంది అనుకోని కేసుల్లో ఇరుకుంటున్నారు. కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటే మరికొంతమంది డ్రగ్స్ కేసుల్లో, రేవ్ పార్టీ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. స్టార్ యాక్టర్స్ దగ్గర నుంచి చిన్న చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వరకు చాలా మంది ఇప్పటికే డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్నారు.
అలాగే కొంతమంది బెయిల్ పై బయటకు వస్తే మరికొంతమంది నిర్దోషులుగా బయటకు వస్తున్నారు. తాజాగా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఓ స్టార్ బ్యూటీ ఎట్టకేలకు నిర్దోషిగా బయట పడింది. కోర్టు ఆమెను నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?
పై ఫొటోలో ఉన్న నటి ఎవరో కాదు రాగిణి . నాని కథానాయకుడిగా వచ్చిన ‘జెండా పై కపిరాజు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ నటి రాగిణి ద్వివేది. కన్నడ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.
2020లో శాండల్‌వుడ్‌లో డగ్స్ కేసు వార్త ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురి చేసింది. నటి రాగిణి ద్వివేది సన్నిహితుడు రవిశంకర్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆమె చాలా రోజులు జైల్లో కూడా గడిపింది. డ్రగ్స్ కేసులో నాలుగేళ్ల తర్వాత రాగిణి నిర్దోషి అని తేలింది.
వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకపోవడంతో, కేసును నిర్దోషిగా విడుదల చేస్తూ హైకోర్టు ఆదేశించింది. దీంతో రాగిణి కాస్త ఉపశమనం పొందింది. డ్రగ్స్ మాఫియాతో రాగిణికి సంబంధాలున్నాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. పార్టీలు నిర్వహించి డ్రగ్స్ వాడారని ఆరోపణలు రావడంతో ఆమె పై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో హైకోర్టు ఆమెను నిర్దోషి తేల్చింది.