
చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న భామల్లో కళ్యాణి ప్రియదర్శన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల డ్రీమ్ గర్ల్ అనే చెప్పాలి. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది.

తెలుగులో ఈ అందాల భామ నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో సైలెంట్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు మలయాళంలో మాత్రం వరుసగా హిట్స్ ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది.

అక్కినేని అందగాడు అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కళ్యాణి. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ అందం, అభినయంటో కుర్రకారును కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత తెలుగులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి, శర్వానంద్ రణరంగం వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు మలయాళంలో బిజీగా ఉంది.

మొన్నామధ్య కొత్త లోక అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కొత్తలోక సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా దుమ్మురేపింది. ఇక సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.