
ప్రముఖ మలయాళ నటుడు జయరాం కుమారుడు, యంగ్ హీరో కాళిదాస్ జయరాం తన బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు. త్వరలోనే తన ప్రియురాలితో కలిసి పీటలెక్కనున్నాడు. తన స్నేహితురాలు తరిణీ కళింగరాయర్‌ను కాళిదాస్ వివాహం చేసుకోనున్నారు. తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది.

ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితుల సమక్షంలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నాడు. అనంతరం తన ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారీ లవ్ బర్డ్స్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాళి దాస్, తరిణీలకు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.

కాగా మలయాళంతో పాటు పలు తమిళ్ సినిమాల్లో కాళిదాస్ నటించాడు. 'విక్రమ్' సినిమాలో కమల్ హాసన్ తనయుడు ప్రభంజన్ పాత్రను పోషించింది కాళిదాసే. ప్రస్తుతం 'ఇండియన్ 2', 'ధనుష్ 50' సినిమాల్లో నటిస్తున్నాడు.

ఇక కాళిదాస్‌కు కాబోయే వధువు తరణీ మోడల్‌గా వర్క్ చేస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా 2021 పోటీల్లో ఆమె మూడో రన్నరప్‌గా నిలవడం విశేషం.

ఇక కాళిదాస్ తండ్రి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. ‘అల.. వైకుంఠపురములో’, ‘ధమాకా’, ‘రాధేశ్యామ్’, ‘ఖుషి’ తదితర హిట్ సినిమాల్లో ఆయన వివిధ పాత్రల్లో నటించి మెప్పించారు.