
ఈ జనరేషన్‌లో తెలుగు హీరోలకు బాలీవుడ్ మూవీస్ పెద్దగా కలిసి రాలేదు. మన సినిమాలతో బాలీవుడ్ మార్కెట్‌ను రూల్ చేసిన హీరోలు కూడా స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ విషయంలో తడబడ్డారు.

ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ప్రభాస్, ఆది పురుష్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా దారుణంగా ఫెయిల్ అయ్యింది. కెరీర్ స్టార్టింగ్‌లోనే బాలీవుడ్ మూవీ చేయాలన్న ప్రయత్నం చేసి విమర్శలు ఎదుర్కొన్నారు మెగా వారసుడు రామ్ చరణ్.

జంజీర్ సినిమాతో నార్త్ ఎంట్రీ ఇచ్చిన చరణ్‌కు భారీ షాక్ తగిలింది. దీంతో బాలీవుడ్‌లో కెరీర్ కంటిన్యూ చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నారు చెర్రీ. రీసెంట్‌గా యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇదే పొరపాటు చేశారు.

తెలుగులో సూపర్ హిట్ అయిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశారు సాయి. ఈ సినిమా కూడా నార్త్ ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో తెలుగు హీరోలు బాలీవుడ్‌లో స్ట్రయిట్ సినిమాలు చేసి మెప్పించటం కష్టమన్న నిర్ణయానికి వచ్చేశారు ప్రేక్షకులు.

ఇప్పుడు తారక్ కూడా స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. బాలీవుడ్ సెంటిమెంట్ తారక్‌ను కూడా ఇబ్బంది పెడుతుందేమో అని భయపడుతున్నారు. మరి జూనియర్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారా...? బాలీవుడ్ డెబ్యూలో సత్తా చాటుతారా.. లెట్స్ వెయిట్ అండ్ సీ.