
ప్రజెంట్ బాలీవుడ్ స్పై సిరీస్‌లో తెరకెక్కుతున్న వార్ 2లో నటిస్తున్నారు తారక్. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

ఆ తరువాత కూడా వరుసగా పరభాషా దర్శకులతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, వరుసగా అదే రేంజ్ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టేస్తున్నారు.

అనుకున్న అభిమానులకు దేవరతో ఫుల్ మీల్స్ పెట్టేశారు తారక్. ఆ సినిమా సక్సెస్ జోష్‌లో ఉండగానే వార్2 నుంచి వండర్‌ఫుల్ గిఫ్ట్ రెడీ అవుతోందంటూ ఊరిస్తోంది నార్త్ సర్కిల్.

అది నిజమే అయితే గనక.. ఇకపై నల్ల సముద్రం అనే మాట చాలాసార్లు వింటారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్నారు. అదేంటి యాంకర్ పార్ట్‌లోనేమో నల్ల సముద్రం అని.. ఇక్కడేమో ఎన్టీఆర్, వార్ 2 అంటూ ఏదేదో చెప్తున్నారు అనుకుంటున్నారా..?

స్పై యూనివర్శ్ లవర్స్ కి ది బెస్ట్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్సయిందట యష్‌రాజ్ ఫిల్మ్స్. ఓ వైపు వార్2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రీ రిలీజ్ ప్రమోషన్లు చూసుకుంటూనే, నీల్ సినిమాను కంప్లీట్ చేయాలన్నది తారక్ ప్లాన్.

వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ నార్త్ అండ్ సౌత్ ప్రాజెక్టులతో బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్. పనిలో పనిగా మరిన్ని కథలు వినాలన్నది కూడా ఆయన విష్.