బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తల్లి శ్రీదేవి అందాన్ని పుణికిపుచ్చుకున్న ఈ చిన్నది హీరోయిన్ గా తన సత్తా చాటుతోంది. పెద్ద సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
వచ్చిన ఆఫర్స్ అన్ని చేయకుండా ఆచితూచి అడుగులేస్తోంది. కమర్షియల్ సినిమాతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది ఈ చిన్నది. ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది కానీ సాలిడ్ సక్సెస్ అందుకోలేకపోయింది.
అలాగే ప్రైవేట్ ఆల్బమ్ లో స్టెప్పులేసి అలరించింది. ఈ సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక జాన్వీ సోషల్ మీడియా గురించి అందరికి తెలిసిందే. రోజు ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి.
త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది ఈ వయ్యారి. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జాన్వీ ఈ సినిమాలో పల్లెటూరి యువతిగా కనిపించనుంది.
అందాల ఆరబోతలో ఏమాత్రం మొహమాటపడకుండా ఫోటోలకు ఫోజులిస్తుంది. తన గ్లామర్ తో కుర్రకారును, దర్శక నిర్మాతలను తన వలలో వేసుకుంటుంది జాన్వీ కపూర్. అంతే కాదు హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ చిన్నది.