Jabardasth Praveen: జబర్దస్త్ ప్రవీణ్ ఇంట్లో బోనాల వేడుకలు.. కొత్త జంట ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

Updated on: Aug 10, 2026 | 10:37 PM

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యంగా భాగ్యనగరంలో బోనాల సంబరాలు ఆకాశాన్నంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా భక్తులందరూ సమీపంలోని అమ్మవారి దేవాలయాకు వెళ్లారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

1 / 6
 జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ ప్రవీణ్.. డ్యాన్సర్ కడెం వంశితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి వివాహం సింపుల్ గా జరిగింది. ఈ నేపథ్యంలో బోనాల సందర్భంగా ఈ కొత్త జంట ఇంట్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహంచారు.

2 / 6
 ఈ సందర్భంా అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ప్రవీణ్-వంశిత. అనంతరం తమ బోనాల పూజలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారీ న్యూ కపుల్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

3 / 6
  కాగా జూన్ లో ప్రవీణ్- కడెం వంశితల వివాహం జరిగింది. సింపుల్ గా ఓ గుడిలో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. అలాగే జబర్దస్త్ కమెడియన్లు కూడా వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు.

4 / 6
 ఇక పెళ్లి తంతు ముగియడంతో మళ్లీ తమ ప్రొఫెషనల్ లైఫ్ పనుల్లో బిజీ అయిపోయారు ప్రవీణ్- వంశిత. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ తదితర టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు ప్రవీణ్. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ కమెడియన్ గా, సహాయక నటుడిగా మెరుస్తున్నాడు.

5 / 6
 కాగా హైదరాబాద్ లో జరిగిన బోనాల వేడుకల్లో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు పాల్గొన్నరు. బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య, జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా బోనమెత్తి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరలయ్యాయి.

6 / 6
ఇక టాలీవుడ్ రౌడీ  బాయ్ విజయ్ దేవరకొండ కూడా బోనాల వేడుకల్లో పాల్గొన్నాడు. తమ్ముడు ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్  సందీప్ రెడ్డి వంగాతో కలిసి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us