
సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ మార్క్ మాస్ యాక్షన్‌కు రజనీ ఇమేజ్, స్టైల్‌ను యాడ్ చేస్తూ రూపొందించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ప్రతీ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దర్శకుడు లోకేష్. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు.

లియో సినిమా హరిబరిగా రిలీజ్ చేయాల్సి రావటంతో రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడింది. అందుకే కూలీ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా మ్యాగ్జిమమ్ టైమ్ తీసుకుంటున్నారు. ఈ సినిమాను ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా ఎనౌన్స్ చేశారు.

అయితే ఆ డేట్‌కు ఆల్రెడీ వార్ 2 టీమ్ కర్చీఫ్ వేసింది. ఆ మధ్య వాయిదా వార్తలు వినిపించినప్పుడు డేట్ మారే ప్రసక్తే లేదని మరోసారి కన్ఫార్మ్ చేసింది కూడా. కూలీ సినిమాలో రజనీకాంత్‌తో పాటు ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా కనిపించబోతున్నారు.

ఈ రెండు సినిమాలు సేమ్ డేట్‌కు వస్తుండటంతో, సిల్వర్ స్క్రీన్ మీద ఇదే బిగ్ క్లాష్ అంటున్నారు. ఆమిర్, హృతిక్ పోటి పడుతుండటంతో సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ ఈ క్లాష్ గురించి గట్టిగానే చర్చ జరుగుతోంది.

దక్షిణాదిలో రజనీ వర్సెస్ ఎన్టీఆర్ అన్నది ఇప్పుడు ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్‌గా మారింది. తెలుగులో ఎన్టీఆర్, తమిళ్‌లో రజనీ ఇద్దరూ తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్నవారే. రీసెంట్ టైమ్స్‌లో ఈ ఇద్దరూ పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన వారే. అందుకే ఈ ఇద్దరి సినిమాల మధ్య క్లాష్ ఇప్పుడు నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్ అవుతుంది.