
ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేయాలని గట్టిగా ఫిక్సయ్యారు పవన్ కళ్యాణ్. అందుకే నెల రోజుల గ్యాప్‌లోనే మూడో సినిమా సెట్‌లో జాయిన్ అయిపోయారీయన. ఆ మధ్య హరిహర వీరమల్లు.. ఈ మధ్యే ఓజి.

తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్.. ఇలా రెండేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ ఒకేసారి పూర్తి చేస్తున్నారు పవర్ స్టార్. హైదరాబాద్‌లో ఉస్తాద్ షూటింగ్ మొదలైంది. పవన్ కూడా సెట్‌లో అడుగు పెట్టారు.

కోటి ఉమెన్స్ కాలేజ్‌తో పాటు, అల్యూమీనియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమాకు పవన్ 45 రోజుల డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆగస్ట్‌లోపే టాకీ పార్ట్ పూర్తి కానుంది.

ఉస్తాద్ తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితమవ్వాలని చూస్తున్నారు జనసేనాని.గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో ఉస్తాద్‌పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. పైగా గతంలో వచ్చిన టీజర్స్‌కు రెస్పాన్స్ అదిరింది.

పవన్ పొలిటికల్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేసారు హరీష్ శంకర్. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తైతే.. అధికారికంగా పవన్ ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తైనట్లే. వీటి తర్వాత కొత్త అడ్వాన్సులు అయితే పవన్ తీసుకోలేదు.