ఇక ఈ మధ్య బాలకృష్ణ వరస సినిమాలతో, బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తున్నాడు. తాజాగా డాకు మహారాజ్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ క్రమంలో బాలయ్యకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అది ఏమిటంటే. ఏ హీరోనైనా సరే హిట్ కథను ఎంచుకొని ఆ సినిమానే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
కానీ బాలయ్య మాత్రం కథన నచ్చకపోయినా, ఒక సినిమా డిజాస్టర్ అవుతుందని తెలిసినా కూడా సినిమా చేసి, ఊహించని డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడంట. ఇంతకీ అది ఏ సినిమా అంటే?
దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తిరుగబడ్డ తెలుగు బిడ్డ అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా కథ బాగలేకపోవడమే కాకుండా సినిమా డిజాస్టర్ అవుతుందని డైరెక్టర్, బాలయ్య అనుకొని, సినిమా అపేద్దాం అనుకున్నారంట.
కానీ సీనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను తప్పకుండా తీయాల్సిందేనని పట్టుపట్టడంతో చేసేది ఏం లేక సినిమా తీశారంట. అంతే కాకుండా ఇష్టం లేకపోయినా బాలకృష్ణ ఈ మూవీలో నటించి తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట్ అందుకున్నాడంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.