
కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది హీరోయిన్ శ్రుతి హాసన్. చివరిసారిగా సలార్ చిత్రంలో కనిపించిన ఈ అమ్మడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంది.

జీవితంలో ఇలాంటి పని ఎందుకు చేశానా.. అని బాధపడిన సందర్భాలు ఎక్కువగా లేవని.. కానీ కొన్నిసార్లు తనకు ఇష్టమైన వారిని బాధపెట్టానని.. అనుకోకుండా జరిగినప్పటికీ అలా చేయకుండా ఉండాల్సింది అనే భావన ఎప్పటికీ ఉంటుందని.. జీవితాంతం వారికి క్షమాపణలు చెబుతూనే ఉంటానని తెలిపింది.

తన జీవితంలో బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయని.. బ్రేకప్ అయ్యాక దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటానని.. కానీ తన లవ్ స్టోరీస్ గురించి చాలా మంది మాట్లాడుతుంటారని తెలిపిందే. ఇతడు ఎన్నో బాయ్ ఫ్రెండ్ అని అడుగుతుంటారని తెలిపింది.

తాను ఇండస్ట్రీలో ఇండస్ట్రీలోకి రావడానికి ముందు చాలా కష్టాలను చూశానని.. తన తల్లిదండ్రులు విడిపోవడం తనను ఎంతో బాధించిందని తెలిపింది. వాళ్లిద్దరూ విడిపోయాక తాను అమ్మతో ఉన్నానని.. అప్పటివరకు ఉన్న జీవితం ఒక్కసారిగా మారిందని తెలిపింది.

చెన్నై నుంచి ముంబై వచ్చాక విలాసవంతమైన జీవితం దూరమైందని.. అప్పటివరకు మెర్సిడెజ్ బెంజ్ కారులో దిగిన తాను లోకల్ ట్రైన్ లోనూ ప్రయాణించానని.. రెండు రకాల జీవితాలు చూశానని.. ఇండస్ట్రీలోకి వచ్చాక ఎక్కువగా తన తండ్రితో ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది.