
వార్ 2 కోసం డ్రాగన్ షూట్‌కు షార్ట్ బ్రేక్ ఇవ్వబోతున్నారు తారక్. ఒక్క పాట మినహా వార్ 2 షూటింగ్ అంతా ఎప్పుడో పూర్తయ్యింది. అయితే ఒక్క పాటే సినిమాలో చాలా కీలకం కావటంతో ఆ పాటను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది యూనిట్. ఇంతకీ ఆ సాంగ్ ఎందుకంత స్పెషల్ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ.

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న వార్ 2లో నాటు నాటు లాంటి పాటను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇండియాలో ది బెస్ట్ డ్యాన్సర్స్‌గా పేరున్న హృతిక్, తారక్ కలిసి స్టెప్పేస్తే థియేటర్లు ఊగిపోవటం ఖాయం.

అందుకే వాళ్ల ఎనర్జీని మ్యాచ్ చేసే రేంజ్‌లో అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేశారు.ఈ సాంగ్ గతంలోనే షూట్ చేసేందుకు ప్లాన్ చేసినా.. హృతిక్ గాయపడటంతో ఆలస్యమైంది.

ఇప్పుడు హీరోలిద్దరూ రెడీ అనటంతో ఈ నెలలోనే సాంగ్ షూట్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది అయాన్ టీమ్. త్వరలో డ్యాన్స్ వార్‌కు రెడీ అవుతున్నారు హృతిక్, తారక్. వార్ 1లో హృతిక్, టైగర్ కలిసి నటించారు.

ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ పాటను తెరకెక్కించారు. ఆ సాంగ్ సినిమా సక్సెస్‌లోనూ కీ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు అలాంటి పాటనే వార్ 2 కోసం కూడా రెడీ చేస్తున్నారు. కానీ ఈ సారి స్కేల్‌తో పాటు డ్యాన్స్ మూమెంట్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్.