- Telugu News Photo Gallery Cinema photos Heroine Shruti hassan completed 15 years in TFI and Heroine anjali says be bold Telugu Actress Photos
Shruti hassan – Anjali: బీ బోల్డ్ అంటున్న అంజలి.. ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న శృతి.
కెరీర్ లాంగ్ రన్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? మమ్మల్ని అడగండి మేం చెబుతాం అంటున్నారు త్రిష అండ్ నయన్. వారిద్దరి కోవలోకే లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు శ్రుతిహాసన్, అంజలి అండ్ అదర్స్.. ఇన్నేళ్ల కెరీర్‌లో ఈ ముద్దుగుమ్మలు ఎలా సస్టయిన్ అవుతున్నారు.? శ్రుతిహాసన్ ఇండస్ట్రీలో 15 ఏళ్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారన్నది లేటెస్ట్ న్యూస్. బాలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఏం అందుకోలేదు.
Updated on: Jul 26, 2024 | 7:52 PM

కెరీర్ లాంగ్ రన్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? మమ్మల్ని అడగండి మేం చెబుతాం అంటున్నారు త్రిష అండ్ నయన్. వారిద్దరి కోవలోకే లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు శ్రుతిహాసన్, అంజలి అండ్ అదర్స్.. ఇన్నేళ్ల కెరీర్‌లో ఈ ముద్దుగుమ్మలు ఎలా సస్టయిన్ అవుతున్నారు.?

శ్రుతిహాసన్ ఇండస్ట్రీలో 15 ఏళ్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారన్నది లేటెస్ట్ న్యూస్. బాలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఏం అందుకోలేదు. అయినా స్ట్రాంగ్‌గా నిలబడి ప్రూవ్ చేసుకున్నారు.

స్టార్ కిడ్ అయినా, మిగిలిన హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా అన్ని విధాలా గట్టి పోటీ ఇస్తూ ముందుకు సాగారు. అలాంటి ఏజ్ గ్రూప్స్ తోనే చేస్తానూ.. ఇలాంటి సబ్జెక్టులే చేస్తానని ఎప్పుడూ గిరి గీసుకుని కూర్చోలేదు శ్రుతి.

సీనియర్లయినా, జూనియర్లయినా తన కేరక్టర్ బావుంటే ఆలోచించకుండా చేసేశారు. యాక్షన్ సన్నివేశాలైనా, బోల్డ్ సీన్స్ అయినా, స్పెషల్ సాంగ్స్ అయినా.. మనసుకు నచ్చితే మరో మాట మాట్లాడకుండా సైన్ చేసి ప్రూవ్ చేసుకున్నారు ఈ బ్యూటీ.

కెరీర్ లాంగ్ రన్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉండాలంటే అన్నీ తరహా పాత్రల్లోనూ మెప్పించాలని అంటున్నారు అచ్చ తెలుగు అందం అంజలి. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్నేళ్లయిందంటూ లెక్కపెట్టడం మానేశానంటున్నారు ఈ బ్యూటీ.

అనుష్క, తమన్న, త్రిష, నయన్‌లాగా అంజలి కూడా సౌత్ లాంగ్వేజ్‌లో తన పెర్ఫార్మెన్స్ తో ప్రూవ్ చేసుకున్నారు. త్వరలోనే గేమ్ చేంజర్‌లో రామ్‌చరణ్‌తో జోడీ కడుతున్నారు సిల్వర్‌స్క్రీన్ సీతమ్మ అంజలి.

అంతే కాదు, రీసెంట్‌గా బహిష్కరణ సీరీస్‌లో బోల్డ్ సీన్స్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఒకప్పటితో పోలిస్తే, మహిళల కోసం ప్రత్యేకంగా కథలు రాసే కెప్టెన్స్ సంఖ్య పెరుగుతోందని అంటున్నారు మేడమ్ అంజలి.




