
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు అన్ని చోట్లా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు గిరాకీ బాగానే ఉంది. కథ డిమాండ్ చేసి.. సినిమాలో మంచి హీరోయిన్ ఉంటే 20 నుంచి 40 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు. కానీ అవి వెనక్కి వస్తాయా అనేది మాత్రం అనుమానమే.

ఎందుకంటే మన దగ్గర లేడీ ఓరియెంటెడ్ సినిమాల సక్సెస్ రేట్ చాలా అంటే చాలా తక్కువ. ఎప్పుడో పుష్కరానికో సినిమా హిట్ అవుతుంటాయి. మిగిలిన సిసనిమాలన్నీ ఫట్టే. అందుకే ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేసినా కూడా చాలా తక్కువ బడ్జెట్‌లోనే చేయాలి అంటుంటారు సీనియర్ నిర్మాతలు.

కానీ అలా జరగే ఆస్కారమే లేకుండా పోతుంది ఈ రోజుల్లో. స్టార్ హీరోయిన్ సినిమాలో ఉన్నపుడు ఖర్చు కూడా అదే స్థాయిలో జరుగుతుంది. ఇప్పుడు కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాల వైపు అడుగులు వేస్తుంది కాజల్.

ఇప్పటి వరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చందమామకు పెద్దగా కలిసిరాలేదు. అయినా కూడా కథపై నమ్మకంతో ఇప్పుడు సత్యభామ అనే సినిమా చేస్తుంది ఈ బ్యూటీ. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంది. కాజల్‌కు జోడీగా నవీన్ చంద్ర నటిస్తున్నాడు.

ఈ సినిమాతో సుమన్ చిక్కాల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమాతో గూడఛారి, మేజర్ సినిమాల దర్శకుడు శశికిరణ్ తిక్క నిర్మాణంలో అడుగు పెడుతున్నాడు. అంతే కాదు... సత్యభామ సినిమాకు శశికిరణ్ తిక్కానే స్క్రీన్ ప్లే అందించారు.

ఇక షూటింగ్ విషయానికి వస్తే.. కేవలం 35 రోజుల్లోనే 90 శాతం షూటింగ్ పూర్తైపోయింది. ఇందులో యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేస్తుంది కాజల్. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది చందమామ.

ఇదిలా ఉంటే బడ్జెట్ విషయానికి వచ్చేసరికి కాస్త ఓవర్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముందు అనుకున్న దానికంటే బాగానే అవుతుందని.. అయినా కూడా కాజల్ స్టార్ డమ్ సినిమాను కాపాడుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.

టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లో మర్డర్ మిస్టరీని చూపించారు. ఓ అమాయకపు యువతి ప్రాణాలు తీసిన హంతకుల కోసం వేట మొదలు పెడుతుంది సత్యభామ.

తన దారికి అడ్డు వచ్చిన విలన్లను చిత్తకొడుతుంది.. ఆ తర్వాత ఏ: జరిగింది అనేది అసలు కథ. మరి ఓవర్ బడ్జెట్ అవుతున్న సత్యభామను తన భుజాలపై కాజల్ ఎంతవరకు మోస్తుందనేది చూడాలిక.