
జైలర్ 2 క్యారక్టర్ ప్రిపరేషన్ కోసం టైమ్ స్పెండ్ చేయాలని ఫిక్సయ్యారు. సో.. బ్యాక్ టు బ్యాక్ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు దద్దరిల్లుతాయన్నది తలైవర్ కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం.

కానీ రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ సైతం ఇప్పుడు టెన్షన్‌లోనే ఉన్నారు. వేట్టయన్ ఆయన్ని నిద్ర కూడా పోనివ్వట్లేదు. మరి అంతగా రజినీ కంగారు పడటానికి కారణమేంటి.?

ఒకటి రెండు కాదు.. దాదాపు పదేళ్ళ తర్వాత జైలర్ సినిమాతో నిఖార్సైన బ్లాక్‌బస్టర్ కొట్టారు రజినీకాంత్. తెలుగు, తమిళం అని తేడా లేకుండా అన్నిచోట్లా రప్ఫాడించింది ఈ చిత్రం.

ఏకంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి.. రజినీ భారాన్ని దించేసింది జైలర్. మొన్నామధ్య లాల్ సలామ్ ఫ్లాపైనా.. అది రజినీ సినిమా కాదు. అందుకే ఆశలన్నీ వేట్టయన్‌పైనే ఉన్నాయి.

టిజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న వేట్టయన్ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. తాజాగా జరిగిన ఆడియో వేడుకలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ముందు సినిమా ఫ్లాపైతే.. హీరోకు ఓ రకమైన టెన్షన్ ఉంటుంది.

అదే హిట్ అయితే మరో రకమైన కంగారు ఉంటుంది. ఇప్పుడు తాను అదే టెన్షన్‌లో ఉన్నట్లు తెలిపారు సూపర్ స్టార్. జైలర్ తర్వాత వస్తుండటంతో వేట్టయన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

జైలర్ సినిమాలో కన్నడ, మలయాళ స్టార్స్‌ను గెస్ట్ రోల్స్ కోసం సెలెక్ట్ చేసుకున్న రజనీ, సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్‌ను కూడా రంగంలోకి దించబోతున్నారు. ఆ గెస్ట్ ఎవరన్నది కన్ఫార్మ్ కాకపోయినా.. రజనీ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయటం మాత్రం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

కూలీ సినిమాలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్ చేయబోతున్నారన్నది సౌత్, నార్త్ సర్కిల్స్‌లో ట్రెండింగ్ టాపిక్. త్వరలో స్టార్ట్ అవ్వబోయే జైపూర్ షెడ్యూల్‌లోనే ఈ కాంబోకు సంబంధించిన సీన్స్ షూట్ చేయబోతున్నారట.