
తాగుబోతు రమేశ్ అసలు పేరు రమేష్ రామిళ్ల. కరీంనగర్ జిల్లా లోని గోదావరిఖనిలో పుట్టి పెరిగాడు. తండ్రి సింగరేణి గనుల్లో కార్మికుడు కాగా తల్లి గృహిణి. బాల్యం నుంచి తాగుబోతులను బాగా దగ్గరగా గమనిస్తూ వచ్చిన రమేష్ వారిలాగే నటిస్తూ అందరినీ నవ్వించసాగాడు.

2006లో అక్కినేని ఫిలిం ఇన్‍స్టిట్యూట్ నుంచి నటనలో పట్టా పుచ్చుకున్నాడు రమేష్. ఆ తర్వాత సుకుమార్- రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన జగడం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. దీని తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా మెప్పించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

ముఖ్యంగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తాగుబోతు రమేష్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో అతని నటనకు ఉత్తమ హాస్య నటుడిగా నంది పురస్కారం కూడా వచ్చింది.

ప్రస్తుతం వెండితెరపై, బుల్లితెరపై కామెడీ జల్లులు కురిపిస్తోన్న రమేష్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు జబర్థస్త్ లో కూడా తన సత్తా చూపిస్తున్నాడు. తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.

కాగా వరుసగా సినిమాలు చేసిన తాగుబోతు రమేష్ కు మధ్యలో బ్రేక్ వచ్చింది. చాలా రోజుల పాటు సినిమాల్లో కనిపించలేదు. దీంతో జజబర్ధస్త్ లోకి అడుగు పెట్టాడీ కమెడియన్. అక్కడ తన ట్యాలెంట్ తో టీమ్ లీడర్ గా ఎదిగి బుల్లితెర ఆడియన్స్ కు దగ్గరయ్యాడు.

సినిమాలు, టీవీ షోల సంగతి పక్కన పెడితే.. తాగుబోతు రమేష్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తుంటాడీ కమెడియన్. రమేష్ కు ఇద్దరు అందమైన కూతుళ్లు ఉన్నారు. ప్రస్తుతం వీరి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.