
"యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా.. ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా ".. సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. ఈ పాటలో శోభన లుక్ రీక్రియేట్ చేసిన ఈ అమ్మాయిని గుర్తుపట్టండి.

దళపతి చిత్రంలో రజినీకాంత్, మమ్ముట్టి, శోభన ప్రధాన పాత్రలలో నటించగా.. మణిరత్నం దర్శకత్వం వహించారు. సినీ ప్రియులను ఇప్పటికీ మెప్పించే ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ. ఇందులో యమునాతటిలో పాటలో శోభన లుక్స్ అందరికీ ఫేవరేట్.

ఇప్పుడు అలనాటి అందాల తార శోభన లుక్ ను రీక్రియేట్ చేసింది ఎస్తేర్ అనిల్. తమిళంతోపాటు.. తెలుగు ప్రేక్షకుకు సుపరిచితమే ఈ అమ్మాయి.

విక్టరీ వెంకటేష్, మీనా నటించిన దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురుగా నటించింది ఎస్తేర్ అనిల్. ఇక దృశ్యం 2లోనూ మరోసారి కనిపించింది.

2001 ఆగస్ట్ 27న కేరళలోని యనాడ్ ప్రాంతంలో జన్మించింది ఎస్తేర్ అనిల్. 2010లో నల్లవన్ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2013లో విడుదలైన దృశ్యం సినిమా గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఎస్తర్ అనిల్ 2016లో ఉత్తమ బాలనటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం ఎస్తేర్ అనిల్ హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది ఎస్తేర్ అనిల్.

తాజాగా దళపతి సినిమాలోని శోభన లుక్ రీక్రియేట్ చేసిన ఫోటోస్ షేర్ చేయగా.. తెగ వైరలవుతున్నాయి.

యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా.. దళపతిలో శోభన లుక్ రీక్రియేట్ చేసిన అమ్మాయిని గుర్తుపట్టారా ?..

యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా.. దళపతిలో శోభన లుక్ రీక్రియేట్ చేసిన అమ్మాయిని గుర్తుపట్టారా ?..