
సోషల్ మీడియాలో ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి వైరలవుతుంది. చూడచక్కని రూపం.. ఆక్టటుకునే కళ్లు.. హృదయాలను దొచేసే చిరునవ్వుతో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నారి .. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఇంతకీ ఎవరో తెలుసా.. ?

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఐశ్వర్య మీనన్. ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళనాడులోని ఈరోడు ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.

ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని ఈ ముద్దుగుమ్మ.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. కాదలిల్ సోదప్పువదు ఎప్పటి సినిమాతో తెరంగేట్రం చేసిన ఐశ్వర్య.. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించింది.

లవ్ ఫెయిల్యూర్ సినిమాతో హీరోయిన్ గా మారిన ఐశ్వర్య.. ఆ తర్వాత తెలుగులోనూ ఆఫర్స్ అందుకుంది. దాదాపు పదేళ్లుగా సినీ పరిశ్రమలో నటిగా కొనసాగుతుంది ఐశ్వర్య.

నిఖిల్ జోడిగా స్పై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఐశ్వర్య. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో తెలుగులో ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.