టాలీవుడ్ లో చాలా మంది అందాల సింగర్స్ ఉన్నారు. గాత్రంతోనే కాదు అందమైన రూపంతోనూ ఆకట్టుకుంటున్నారు. అలాంటివారిలో దామిని ఒకరు. ఈ చిన్నది తన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాహుబలి సినిమాతో దామిని మంచి గుర్తింపు తెచ్చుకుంది.
పదుల సంఖ్యలో పాటలు పాడిన దామినికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. పాటలతోనే కాదు అందంలోనూ ఈ అమ్మడు వావ్ అనిపిస్తుంది.
దామిని గ్లామర్ పరంగాను ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 లో తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంటుంది.
బిగ్ బాస్ సీజన్ 7 లో దామిని స్ట్రాంగ్ లేడీగా కంటిన్యూ అవుతుంది. కానీ గతకొద్దిరోజులుగా దామిని ఆట పై విమర్శలు ఎదుర్కొంటుంది.హౌస్ లో ఉన్నవారితో గొడవలు పెట్టుకుంటూ ..సేఫ్ గేమ్ ఆడుతుందని అంటున్నారు ప్రేక్షకులు.
ఇదిలా ఉంటే ఈ వీరం హౌస్ నుంచి దామిని ఎలిమినేట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ చిన్నదాని రెమ్యునరేషన్ గురించి టాక్ వినిపిస్తుంది. దామిని వారం రోజులకు 2 లక్షల రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తోంది.