Delay Movies: కొనసాగుతున్న స్టార్ హీరోల సినిమాలు వాయిదా.. నిరాశలో ఫ్యాన్స్‌..

Updated on: May 24, 2025 | 4:07 PM

స్టార్ హీరోల సినిమాలు రెగ్యులర్‌గా థియేటర్లలో సందడి చేస్తేనే ఫ్యాన్స్‌ హ్యాపీగా ఉంటారు. కానీ పాన్ ఇండియా ట్రెండ్‌లో ఆ పరిస్థితి కనిపించటం లేదు. భారీ చిత్రాల రిలీజ్‌ విషయంలో అందరి అంచనాలు తారుమారుతున్నాయి. రీసెంట్‌ టైమ్స్‌లో ఆడియన్స్‌ను వెయిటింగ్‌లో పెడుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి.

1 / 5
మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్‎గా  తెరకెక్కుతున్న టాలీవుడ్ సోసియో ఫాంటసీ మూవీ విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సి ఉంది.

2 / 5
కానీ పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ డిలే కావటంతో ఇంత వరకు రిలీజ్ కాలేదు. సంక్రాంతితో పాటు సమ్మర్ లాంటి మంచి సీజన్స్‌ను స్కిప్‌ చేసిన విశ్వంభర టీమ్‌, ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది అర్ధం కావటం లేదు.

3 / 5
ప్రభాస్‌ ది రాజాసాబ్‌ విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఫస్ట్ టైమ్ ప్రభాస్‌ హారర్‌ కామెడీ మూవీ చేస్తుండటంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ యూనిట్ మాత్రం ఫ్యాన్స్ గురించి పట్టించుకోకుండా సినిమాను వాయిదా వేస్తూ పోతోంది.

4 / 5
Rajasaab Movie

Rajasaab Movie

5 / 5
కేజీఎఫ్‌ మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్‌ కూడా నెక్ట్స్ సినిమా విషయంలో ఫ్యాన్స్‌ను వెయిటింగ్‌లో పెట్టారు. రెండేళ్ల క్రితమే టాక్సిక్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వచ్చినా.. ఇంత వరకు ఆడియన్స్‌ ముందుకు రాలేదు. 2026 మార్చిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించి ఫ్యాన్స్‌ను మరింత వెయిటింగ్‌లో పెట్టేశారు రాకీ భాయ్‌. ఇలా స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడుతుండటంతో ఫ్యాన్స్‌ ఫీల్ అవుతున్నారు.