ఒకప్పుడు సీక్వెల్ అనే మాట వింటే చాలు మన నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. దానికి కారణం కూడా లేకపోలేదు. శంకర్ దాదా జిందాబాద్, గాయం 2, సర్దార్ గబ్బర్ సింగ్, కిక్ 2, నాగవల్లి, ఆర్య 2.. ఇలా ఒకటా రెండా కొన్నేళ్ల వరకు సీక్వెల్స్ అన్నీ ఫ్లాపులే. కానీ కార్తికేయ 2, బంగార్రాజు, ఎఫ్ 3 లాంటి సినిమాలతో ఇప్పుడా సెంటిమెంట్ మారింది.