
తెలుగమ్మాయి అయిన ఈషా రెబ్బ ప్రస్తుతం హీరోయిన్ గా రాణించడానికి ప్రయత్నిస్తుంది. అంతకు ముందు ఆ తర్వాత అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈషా రెబ్బ హీరోయిన్ గా మెప్పించినప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది.

హీరోయిన్ గా సక్సెస్ అందుకోలేకపోయినప్పటికీ సెకండ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అరవింద సమేత అనే సినిమాలో నటించి మెప్పించింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ చెల్లెలిగా నటించింది ఈషా రెబ్బ.

ఇక సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. గ్లామరస్ ఫోటోలను షేర్ చేసి నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా చీర కట్టులో ఫోటోలకు ఫోజులిచ్చింది.