Eesha Rebba: ఆ చంద్రుడు ప్రేమలో పడతాడేమో ఈ వయ్యారి అందాన్ని చూసి.. ఆహా అనిపిస్తున్న ఈషా..

| Edited By: Ram Naramaneni

Jan 22, 2024 | 4:15 PM

ఈషా రెబ్బా ప్రధానంగా తెలుగు చిత్రాలలో పనిచేసే నటి. పేరుకు సహాయ నటి అయినా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చాల ఎక్కువ. అంతక ముందు ఆ తర్వాత, బండిపోటు, అమీ తుమీ, విస్మయం చిత్రాలలో ఆమె తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. వీటితో పాటు.. కొన్ని వెబ్ సిరీస్ కూడా చేసింది ఈ బ్యూటీ. ఈమె ఎడ్యుకేషన్, పుట్టిరోజు, డెబ్యూ సినిమా వంటి కొన్ని విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
19 ఏప్రిల్ 1990న తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో ఓ తెలుగు కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ ఈషా రెబ్బా. హైదరాబాద్‌లో పెరిగింది. ఆమె ఎంబీఏ చదివింది. కాలేజీ సమయంలో మోడల్‌గా పనిచేసింది, ఆ తర్వాత దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి నుండి ఆమెకు ఆడిషన్ కాల్ వచ్చింది.

2 / 5
2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఆమె అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె తొలిసారిగా అంతక ముందు ఆ తర్వాత అనే చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది మరియు దక్షిణాఫ్రికాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

3 / 5
తర్వాత రొమాంటిక్-కామెడీ చిత్రం అమీ తుమీలో కథానాయకిగా ఆమె నటనకు విస్తృత స్పందన లభించింది. ఈ చిత్రానికి రెండు అవార్డులు లభించాయి. తర్వాత విస్మయం చిత్రంలో లెస్బియన్ మహిళ పాత్రను పోషించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు.

4 / 5
ఆ తర్వాత అదే సంవత్సరం బ్రాండ్ బాబు, అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం మరియు సవ్యసాచి అనే నాలుగు సినిమాల్లో నటించింది. ఆమె 2021లో ఒట్టు చిత్రంతో మలయాళ సినీ రంగ ప్రవేశం చేసింది. సినిమాలో తన పాత్ర కోసం ఆమె విలువిద్య మరియు కిక్‌బాక్సింగ్ నేర్చుకుంది.

5 / 5
2021లో 3 రోజెస్ అనే అడల్ట్ వెబ్ సిరీస్ లో రితికగా ప్రధాన పాత్రలో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ సిరీస్ ఈమెకి ఓటీటీ అరంగేట్రం. ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎందులో ఈమెతో పాటు పాయల్ రాజపుట్, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. అదే ఏడాది పిట్ట కథలు అనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ తో ప్రియాంకగా మెప్పించింది. 2023లో జీ5లో మాయా బజార్ ఫర్ సేల్, డిస్నీ+ హాట్ స్టార్ లో దయా సిరీస్ లలో నటించింది.