
బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది సుస్మిత సేన్.. ఇక ఇప్పుడు సినిమాలు తగ్గించింది సుస్మిత సేన్.

తెలుగులోనూ ఓ సినిమాలో నటించింది సుష్మిత సేన్.. ఇటీవలే హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది సుస్మిత .

సుష్మిత సేన్ 1994లో విశ్వ సుందరి పోటీలో విజేతగా నిలిచింది. 2013లో మదర్ థెరిసా అంతర్జాతీయ అవార్డు పొందింది.

సుష్మిత సేన్ వయసు ప్రస్తుతం 48 అయినా కూడా ఇప్పటివరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికే చాలా మందితో డేటింగ్ మాత్రం చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది సుష్మిత సేన్.. తాజాగా ఈ అమ్మడు ఓ కొండచిలువను పెంచుకుంటుంది. ఇప్పుడు ఇదే వార్త బాలీవుడ్ లో వైరల్ అవుతుంది.