
సినీరంగంలో హీరోయిన్గా గుర్తింపు రావాలంటే అందం మాత్రమే కాదు.. కాసింత అదృష్టం కూడా ఉండాలి. కొందరి విషయంలో టాలెంట్ ఎంత ఉన్న లక్కు మాత్రం కలిసిరాలేదు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. కట్ చేస్తే.. అవకాశాలకు దూరంగానే ఉండిపోయింది.

తెలుగులో ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు అందుకుంది. కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. మొత్తం 12 సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే హిట్టు అయ్యాయి. కానీ గ్లామర్ రోల్స్ కు స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అందంలో అప్సరస అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ రావడం లేదు.

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. హీరో కార్తికేయ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఆఫర్స్ మాత్రం రాలేదు. తెలుగులో ఆర్డీఎక్స్ లవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటిక, మంగళవారం వంటి చిత్రాల్లో నటించింది.

తెలుగులో ఈ బ్యూటీ నటించిన చిత్రాలు హిట్ కాలేదు. తెలుగుతోపాటు కన్నడ, పంజాబీ భాషలలో పలు చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ కూడా సరైన బ్రైక్ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. కానీ నెట్టింట రోజుకో పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది.

పాయల్ రాజ్ పుత్ 1990 డిసెంబర్ 5న న్యూఢిల్లీలో జన్మించింది. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో పలు సీరియల్స్ చేసిన పాయల్.. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టింది. తెలుగు, కన్నడ, పంజాబీ భాషలలో పలు సినిమాలు చేసింది.