
హీరోయిన్ త్రిష.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ త్రిష. వరుసగా సినీయర్ హీరోలతో ఆఫర్స్ అందుకుంటూ ఇప్పుడు బిజీగా ఉంది. అలాగే ఇటీవలే విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో హిట్స్ ఖాతాలో వేసుకుంది.

నాలుగు పదుల వయసులోనూ వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ప్రస్తుతం కమల్ హాసన్ థగ్ లైఫ్, చిరంజీవి విశ్వంభర చిత్రాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ క్రమంలోనే త్రిషకు తీరని డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా ? అని అడగ్గా.. ప్రిన్సెస్ తరహా పాత్రలు చేయాలని ఉందని.. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని ఉందని చెప్పుకొచ్చింది.

ఒకవేళ త్రిష హీరోయిన్ కాకపోయి ఉంటే ఏ రంగంలో ఉండేది ? అని అడగ్గా.. త్రిష మాట్లాడుతూ.. మంచి సైకాలజిస్ట్ అయ్యేదాన్ని అని తెలిపింది. యాక్టింగ్ కంటే ముందే సైకాలజిస్ట్ కావాలనుకుందట. అందుకు సంబంధించిన చదువులు కూడా పూర్తి చేసిందట.

కానీ అదే సమయంలో అందాల పోటీల్లో పాల్గొనడం.. అక్కడ సక్సెస్ కావడంతో యాడ్స్ ఆఫర్స్ రావడం.. అప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో లైఫ్ టర్నింగ్ తీసుకుందని తెలిపింది. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.