
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా దేశముదురు. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హాన్సిక మోత్వానీ కథానాయికగా నటించింది. 2007లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో రంభ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, హాన్సిక మోత్వానీ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఇందులోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. అలాగే డైరెక్టర్ పూరిజగన్నాథ్ మార్క్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ కొట్టించాయి.

అయితే ఈ సినిమాకు ముందుగా హాన్సికను కథానాయికగా అనుకోలేదట. ముందుగా ఈ సినిమాకు హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ అనుకున్నారట. ఈ సినిమాకు 100 రోజుల కాల్షిట్ కావాలని అడిగారని.. కానీ అప్పుడు తనకు ఎగ్జామ్స్ ఉండడంతో సినిమాను రిజెక్ట్ చేసినట్లు గతంలో రకుల్ వెల్లడించింది.

రకుల్ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాకు హాన్సికను ఎంపిక చేశారు పూరి. 2007లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలు బిజీగా మారిపోయింది హాన్సిక. దేశముదురు సినిమా మిస్సైనప్పటికీ బన్నీ, రకుల్ కెరీర్ స్క్రీన్ పై అలరించింది.

వీరిద్దరి కాంబోలో వచ్చిన సరైనోడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రకుల్ తోపాటు కేథరిన్, ఆది పినిశెట్టి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం రకుల్ తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది.