
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ సత్తా చాటుతున్నారు. ఫస్ట్ మూవీతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. తక్కువ సమయంలోనే సినీరంగంలోకి తమదైన ముద్ర వేస్తున్నారు. కానీ కొందరు మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు.

అందంలో అప్సరస ఆమె.. తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస సినిమాల్లో నటిస్తుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇప్పటివరకు తెలుగులో ఎనిమిది సినిమాల్లో నటించింది. కానీ అందులో రెండు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ?

తనే హీరోయిన్ రుహానీ శర్మ. కెరీర్ ప్రారంభంలోనే చిలసౌ వంటి విభిన్న కంటెంట్ సినిమాతో జనాలకు దగ్గరయ్యింది. ఇందులో పద్దతిగా ఢీగ్లామర్ లుక్ లో కనిపించి నటిగా ప్రశంసలు అందుకుంది. కానీ ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో రుహానీ అంతగా క్రేజ్ రాలేదు. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. చిలసౌ సినిమా తర్వాత డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హార్ , సైంధవ్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు. దీంతో రుహానీకి సైతం అంతగా పాపులారిటీ రాలేదు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. తాజాగా చీరకట్టులో మరింత గ్లామర్ ఫోజులతో ఫోటోస్ షేర్ చేసింది. ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.