
90వ దశకంలో బాలనటిగా ఆకట్టుకుంది బేబీ షామిలి. జగదేక వీరుడు అతిలోక సుందరి, మాయలోడు వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించింది బేబీ షామిలి.

అయితే మధ్యలో కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చింది. ఇక చాలా సంవత్సరాల తర్వాత సిద్ధార్థ్ సరసన ఓయ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఎందుకో క్లిక్ కాలేకపోయింది. ఆమె చివరిగా నాగశౌర్య అమ్మమ్మ గారిల్లు సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది.

సినిమాలకు దూరంగా ఉన్న షామిలీ ఇప్పుడు డైరెక్షన్‌పై ఆసక్తి చూపుతుందట. నిర్మాతగా సినిమాలు తీయాలనుకుంటుందట.

కాగా షామిలి షీ అనే సంస్థను నడుపుతున్న యువ పారిశ్రామికవేత్త కూడా. రీసెంట్ గా చెన్నైలో షామిలి తన పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఏఆర్ రెహమాన్, మణిరత్నం తదితరులు హాజరయ్యారు.