- Telugu News Photo Gallery Cinema photos Do You Know About Senior Actress Malashree Daughter Aradhana, See How Beautiful She Is Looking Now
Malashree: మాలాశ్రీ కూతురు గురించి తెలుసా? అప్పుడే హీరోయిన్‌గా ఎంట్రీ కూడా.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రీమ్‌గర్ల్‌గా వెలుగొందిన మాలాశ్రీ మన తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయం. బ్యూటీ క్వీన్ గానే కాకుండా యాక్షన్ క్వీన్ గా కూడా సిల్వర్ స్క్రీన్ పై మెరిసిందీ అందాలతార. తెలుగులో సుమన్- మాలాశ్రీది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో పలు హిట్ సినిమాలు వచ్చాయి.
Updated on: Jul 11, 2024 | 11:04 AM

కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రీమ్‌గర్ల్‌గా వెలుగొందిన మాలాశ్రీ మన తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయం. బ్యూటీ క్వీన్ గానే కాకుండా యాక్షన్ క్వీన్ గా కూడా సిల్వర్ స్క్రీన్ పై మెరిసిందీ అందాలతార. తెలుగులో సుమన్- మాలాశ్రీది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో పలు హిట్ సినిమాలు వచ్చాయి.

తెలుగులో ఘరానా అల్లుడు, బావ బావమరిది, తోడి కోడళ్లు, ప్రేమ ఖైదీ, పోలీస్ అల్లుడు, సాహస వీరుడు సాగర కన్య తదితర హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది మాలాశ్రీ.

ఇదిలా ఉంటే మాలాశ్రీ కూతురు ఆరాధన కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దర్శన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కాటేరా సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ అందాల తార.

కాటేర’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆరాధన ఇప్పుడు కొత్త సినిమా కోసం ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ దబూ రత్నాని ఆరాధన ఫోటోలను క్లిక్ మనిపించారు.

ఐశ్వర్యరాయ్, షారుఖ్ ఖాన్, సల్మాన్, హృతిక్, ఇంకా పలువురు ప్రముఖ బాలీవుడ్ నటులు, నటీమణుల ఫోటోలను బంధించిన సెలబ్రిటీ దబూ రత్నాని.. ఇప్పుడు ఆరాధన అందాలను తన కెమెరాలో బంధించారు.

కూతురు ఆరాధనతో పాటు నటి మాలాశ్రీ కూడా డబూ రత్నాని కెమెరాకు బాగా పోజులిచ్చింది. తల్లీ కూతుళ్ల అందమైన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా అభిమానులు వావ్ అంటున్నారు.