
కొన్ని మాటలను కావాలనే అన్నా, యథాలాపంగా అన్నా... జెట్ స్పీడ్‌లో వైరల్ అవుతాయి. టొవినో థామస్ రీసెంట్ ప్రమోషన్లలో అలా అన్న ఓ మాట మీద ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో పెద్ద డిస్కషనే జరుగుతోంది. మాలీవుడ్ హీరోలకీ, టాలీవుడ్ సందుల్లో జరుగుతున్న చర్చకీ ఇంట్రస్టింగ్‌గా క్రియేట్ అయిన లింకేంటి? మాట్లాడుకుందాం వచ్చేయండి..

నేను తెలుగులో సినిమాలు చేయను. తెలుగు సినిమాలు చేయాలంటే భాష రావాలి. భాష రాకపోతే నేను నటించలేను అని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు టొవినో థామస్. అంతవరకు బాగానే ఉంది... ఎవరిష్టం వారిది.. ఎవరి కంఫర్ట్ జోన్ వారిది అని అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన చెప్పిన ఇంకో మాట మాత్రం మిగిలిన హీరోలకు డ్యామేజింగ్‌గా మారిందా?

తెలుగులో మల్టీస్టారర్లు కూడా చేయను. ఒకవేళ చేస్తే... మలయాళంలో హీరోగా నా కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడ్డట్టే అనేశారు టొవినో. దీన్ని బట్టి దుల్కర్, పృథ్విరాజ్, ఫాహద్‌కి మలయాళంలో కెరీర్ ఎలా ఉంది? వాళ్లు ఎప్పటి నుంచో మన దగ్గర మల్టీస్టారర్లు చేస్తూనే ఉన్నారు కదా... అయితే పాజిటివ్‌గానో, లేకుంటే నెగటివ్‌గానో... స్టార్ హీరోలతో చేతులు కలుపుతూనే ఉన్నారుగా...

ఇక్కడ సినిమాలు చేయడానికి అక్కడ వారు కెరీర్‌ని వదులుకున్నట్టేనా? మన సినిమాల్లో నటించడాన్ని వాళ్లు ప్రమోషన్‌గానే ఫీలయ్యారా? ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఎదగాలంటే మాలీవుడ్‌లో మార్కెట్ పోయినా ఫర్వాలేదనుకున్నారా?

ఫాహద్‌కి మొదటి నుంచీ వెర్సటైల్ రోల్స్ చేయలని ఉంది. పృథ్విరాజ్ మల్టీటాలెంటెడ్. డైరక్షన్‌లోనూ ప్రూవ్ చేసుకున్నారు. దుల్కర్ సల్మాన్ జెన్ నెక్స్ట్ కిడ్.. సో ఫస్ట్ నుంచి ప్యాన్ ఇండియా కలలే కన్నారు. సో స్టార్టింగ్ నుంచే వీళ్లు క్లారిటీతోనే స్టెప్పులేస్తున్నారన్నది ఇంకో వెర్షన్. ఏదేమైనా టొవినో మాటలతో అదర్ ఇండస్ట్రీల వైపు చూస్తున్న మలయాళ హీరోల మీద ఫోకస్ పెరిగింది.