
ప్రతి రోజూ ఏదో ఒక రీజన్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు ప్రభాస్. ఇవాళ ఆయన్ని ట్రెండింగ్‌లో ఉంచిన టాపిక్ కల్కి. ఆ సినిమాలో సబ్జెక్ట్ ఎలా ఉంటుంది? ఎలిమెంట్స్ ఏమేం ఉంటాయి? డార్లింగ్ ఏం చేస్తారు? కొత్తగా ఎలా కనిపిస్తారు?

యంగ్ రెబల్ స్టార్‌ని నాగి స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేస్తారు.! ఇన్ని విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. రీసెంట్ రిలీజ్ సలార్‌లో ప్రభాస్ మాట్లాడిందే తక్కువ. శ్రుతిహాసన్‌కి ఆయనతో సన్నివేశాలున్నా రొమాంటిక్‌గా మాత్రం లేవు.

ఆరడుగుల అందగాడికి తోడు, గ్లామరస్ బ్యూటీస్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆ మాత్రం రొమాంటిక్ సీన్స్ ని ఎక్స్ పెక్ట్ చేస్తాంగా... డైరక్టర్లు ఎందుకు అర్థం చేసుకోరు అన్నది ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలింగ్.

అప్పుడెప్పుడో రాధేశ్యామ్‌లో కాసింత రొమాంటిక్‌గా కనిపించారు డార్లింగ్. మళ్లీ కల్కిలోనైనా అలా ఉంటారా? లేదా? అనే టాపిక్ నడుస్తోంది. కల్కి సినిమా విషయంలో విజువల్ ఎఫెక్స్ట్ కి డోకా లేదు. యాక్షన్ మరో రేంజ్‌లో ఉంటుంది.

నెవర్ బిఫోర్ సీన్ వరల్డ్ ని క్రియేట్ చేస్తున్నారు నాగి. మరి రొమాంటిక్ సీన్స్ సంగతేంటి? అంటారా.... మే హూనా అంటున్నారు నాగ్ అశ్విన్. ఫ్యాన్స్ మనసులో మాటలను నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను అని అంటున్నారు నాగ్ అశ్విన్.

జస్ట్ అలా చెప్పడమే కాదు, డార్లింగ్ ప్రభాస్, దిశా పాట్ని మీద అద్భుతమైన రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఆ సాంగ్ పిక్చరైజేషన్ జరుగుతోంది. ఓ వైపు దీపిక పదుకోన్, మరో వైపు దిశా పాట్నితో స్క్రీన్ మీద సమ్మర్‌లో సెగ రేపడానికి రెడీ అయిపోతున్నారు డార్లింగ్ ప్రభాస్.

విజువల్ ట్రీట్, యాక్షన్, పెర్ఫార్మెన్స్, రొమాన్స్ అంటూ అన్నీ యాంగిల్స్ నీ కవర్ చేస్తూ ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్నారు నాగ్ అశ్విన్. ఇక ట్రెండ్ చేయడానికి రెడీ కావాల్సిందే మీరే బోయ్స్ అనే సంకేతాలు వినిపిస్తున్నాయి రెబల్ ఆర్మీకి.