
కన్నడ నాటకు చెందిన చైత్ర రాయ్ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ముఖ్యంగా సీరియల్స్ చూసే ప్రేక్షకుల్లో చాలా మందికి ఈ నటి ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు.

అష్టాచమ్మా సీరియల్‌తో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకుంది ఛైత్ర. అందులో ఆమె అభినయం అందరినీ కట్టి పడేసింది.

అత్తో అత్తమ్మ కూతురో, దట్ ఈజ్ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, మనసున మనసై, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు వంటి పలు సూపర్ హిట్ సీరియల్స్‌లోనూ నటించింది చైత్ర.

సీరియల్స్ తో పాటు అప్పుడప్పుడూ సినిమాల్లో కనిపించే చైత్ర ఆ మధ్యన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ దేవరలో ఓ కీలక పాత్రలో నటించింది.

దేవరలో విలన్ సైఫ్ అలీ ఖాన్ భార్యగా కనిపించిన చైత్ర ఇటీవల రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందింది. తాజాగా తన కూతురికి గ్రాండ్ గా బారసాల కూడా నిర్వహించింది.

ఈ సందర్భంగా తన పాపకు ప్రిష్క అనే పేరు పెట్టారు చైత్ర దంపతులు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.