
అందాల చిన్నది రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమా ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీతో మంచి హిట్ అందుకోవటమే కాకుండా మంచి పాపులారిటీ కూడా సొంతం చేసుకుంది.

ఇక ఈ బ్యూటీకి ఈ మూవీ తర్వాత విపరీతమైన పాపులారిటీ రావడంతో వరసగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకొని, స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. తెలుగులో చాలా మంది స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు అభిమానుల మనసు దోచుకొని, తన కంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రతి ఒక్కరినీ తన గ్లామర్‌తో కట్టి పడేసింది. కానీ అనుకోకుండా తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది అనే చెప్పాలి ఈ బ్యూటీ. కెరీర్ మంచి స్టేజ్‌లో ఉండగానే బాలీవుడ్ చక్కేసింది ఈ బ్యూటీ. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.

అక్కడ కొన్ని రోజుల పాటు వరసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ చిన్నది. తర్వాత బాలీవుడ్ నిర్మాతను ప్రేమించి, గోవాలో ఘనంగా వివాహం చేసుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మకు వివాహం తర్వాత ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో, బిజినెస్‌లపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ చిన్న దానికి బ్యాడ్ టైం నడుస్తోంది. వరస సినిమాలతో హిట్స్ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం చేతిలో అవకాశాలు లేకపోయాయి. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా వైట్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఇవ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.