
ఓయ్ బుజ్జితల్లీ. వచ్చేత్తున్నాను గదే.. కాస్త నవ్వే అని రాజు అంటే ఖుషీ అవుతున్నారు జనాలు. 2025 ఫిబ్రవరిలో రిలీజ్ కావడానికి యమా స్పీడ్‌గా రెడీ అవుతున్నాడు తండేల్ రాజు. యాక్చువల్‌గా డిసెంబర్ 20న రిలీజ్ కావాల్సిన సినిమా తండేల్. కానీ పనులు కంప్లీట్ కాకపోవడంతో ఫిబ్రవరి మంత్‌ని టార్గెట్ చేస్తోంది. తండేల్ తో పోటీ పడుతున్నారు బ్రహ్మానందం.

బ్రహ్మానందం, రాజా గౌతమ్ నటించిన బ్రహ్మానందం సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు ఇన్‌స్టంట్‌గా ట్రెండ్ అయింది. అరే.. భలే క్రేజ్ తెచ్చుకుందే అని అనుకున్నారంతా. రిలీజ్ అయిన థియటర్లలోనూ అదే మేజిక్ క్రియేట్ అయితే సక్సెస్ గ్యారంటీ.

ఈ సినిమాలు వచ్చిన వారానికి లైలా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నెల్లో మెకానిక్ రాకీతో ప్రేక్షకులను పలకరించనున్న విశ్వక్సేన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న లైలాతో గ్యారంటీగా మెప్పిస్తానని అంటున్నారు.

అటు మహాశివరాత్రికి నితిన్ తమ్ముడు రిలీజ్‌కి రెడీ అవుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పక్కాగా శివరాత్రి రోజును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.

అన్నట్టు మ్యాడ్ 2 కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల సందడి తగ్గకముందే ఫిబ్రవరిలో సినిమాలు ఊపందుకోవడం ఆనందంగా ఉందంటున్నారు ట్రేడ్ పండిట్స్.