Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు నెక్ట్స్ వన్ ఇయర్ పండగే పండగ.. కారణం ఏంటంటే?

|

Aug 24, 2021 | 2:03 PM

Megastar Chiranjeevi: అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే... తమ కొత్త సినిమాల కోసం మరిన్ని ప్రణాళికలు రచిస్తున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. జాతీయ, నంది అవార్డులతో పాటు ఏడు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న ఏకైక హీరో మెగస్టార్ చిరంజీవి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ జగత్తును ఏకఛ్చత్రాధిపత్యంగా ఏలుతున్న మేరు నగధీరుడు చిరంజీవి ఆచార్య సినిమా రిలీజ్ కు రెడీగా ఉండగా తాజాగా మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టారు.

1 / 5
తెలుగు సినిమా చరిత్రలో తన నటనతో, డ్యాన్స్ తో  కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న హీరో. దేశ, విదేశాల్లో అభిమాలున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో చిరంజీవి సినిమాలు విడుదలై ఘన విజయం సాధించాయి. ఇప్పటి వరకు 151 సినిమాలు చేసిన ఈ హీరో సాధించిన అవార్డులు, రివార్డులకు లెక్కేలేదు.

2 / 5
 మెగాస్టార్ బర్త్ డే సహజంగా ఎవరి పుట్టిన రోజు అయినా వాళ్లకే పండుగ. కానీ చిరంజీవి బర్త్ డే అందుకు భిన్నం. ఈరోజు కోట్లాది మంది అభిమానులు ఆయన పుట్టిన రోజును పండుగలా నిర్వహిస్తారు. వెల కట్టలేని రీతిలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున మరో మూడు సినిమా టైటిల్స్ ను దర్శకనిర్మాతలు ప్రకటించారు.

3 / 5
మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్‌కు సంబంధించిన టైటిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 'భోళా శంకర్‌’ పేరుని ఖరారు చేసి.. టైటిల్ మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేసింది చిత్ర బృంద. ఇక రాఖి పున్నమి సందర్భంగా చిరంజీవి చెల్లెలు కీర్తి సురేష్ మధ్య రాఖీ కట్టే సన్నివేశంతో ఓ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

4 / 5
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్‌రాజా దర్శకత్వంలో మలయాళం సూపర్ మూవీ లూసిఫర్‌’ రీమేక్‌లో చిరు నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ కూడా మొదలు పెట్టుకుంది.  గాడ్ ఫాదర్ టైటిల్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమా లో డాన్ పాత్రను సల్మాన్ ఖానే చేస్తున్నాడట. ఈ మేరకు అతడు రెండు రోజుల క్రితమే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ లో టాక్.. ఇక కీలక పాత్రల్లో నయనతార, సత్యదేవ్ లు నటిస్తున్నారు.

5 / 5
కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్నారు.పుట్టిన రోజున చిరంజీవి లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. త‌ల‌కు రెడ్ ట‌వ‌ల్ చుట్టుకుని, బీడి కాలుస్తూ, లుంగీ క‌ట్టుకుని నిల్చున్న చిరంజీవి లుక్ ఊర‌మాస్‌ లుక్ లో దర్శనమిచ్చారు.  చేతిలో లంగ‌రు(యాంక‌ర్‌) ప‌ట్టుకుని బోటుపై చిరంజీవి స్టైల్‌గా ఉన్నారు. అటు ప‌క్క‌నున్న జెండాపై చిరంజీవి ఇష్ట‌దైవం హ‌నుమంతుడు క‌నిపిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.