
హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది అందాల ముద్దుగుమ్మ కేథరిన్ థ్రెసా.. ఈ ముద్దుగుమ్మ పూరీజగనాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.

తొలి సినిమాలో గ్లామరస్ గా కనిపించి మెప్పించింది. సినిమా డిజాస్టర్ అయినా ఈ ముద్దుగుమ్మకు మంచి మార్కులు పడ్డాయి.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. కానీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది ఈ చిన్నది.

అల్లు అర్జున్ సరైనోడు, రానా నేనే రాజు నేనే మంత్రి, కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార , చిరంజీవి రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలు మంచి విజయాలను అడ్డుకున్నాయి.

మెయిన్ హీరోయిన్ గానే కాదు, సెకండ్ హీరోయిన్ గానూ నటించి ఆకట్టుకుంది ఈ అందాల భామ. వరుసగా హిట్స్ అందుకుంటుంది కానీ మెయిన్ హీరోయిన్ ఆగ అనుకున్నంతగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోతుంది ఈ బ్యూటీ.

ఇక ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో చిరంజీవి అసిస్టెంట్ గా కనిపించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ తన అందాలతో అదరగొడుతుంది.