
తెలుగు చిత్రపరిశ్రమలో వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్, స్టార్ హీరోలతో నటించి పాపులర్ అయ్యింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి హీరోయిన గా ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ హన్సిక. 16 ఏళ్లకే అగ్రకథానాయికగా మారింది. మొదటి సినిమాతోనే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళంలో వరుస చిత్రాల్లో నటించింది.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే హన్సిక త్వరగా పెరిగేందుకు హార్మోన్స్ ఇంజక్షన్స్ తీసుకుందని ప్రచారం నడించింది. వాటిని ఈ అమ్మడు ఖండించింది.

తక్కువ సమయంలోనే వరుస ఆఫర్స్ అందుకున్న ఈ అమ్మడు.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సైతం ఇండస్ట్రీలో కొనసాగుతుంది.

ప్రస్తుతం భర్తతో కలిసి బిజినెస్ రంగంలో బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.