పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ కుందనపు బొమ్మ టాలీవుడ్ కు చెందిన టాలెంటెడ్ హీరో భార్య. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలికీ చెందిన అమ్మాయి అయినా.. హీరోయిన్, నిర్మాత, దర్శకురాలు అసలే కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 ఫ్రేమ్స్ తో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు తనే ప్రియ దర్శిని.

దివంగత సూపర్ స్టార్ కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని ఘట్టమనేని. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు సతీమణి. తన భార్య ఫోటోను గతంలో ఇన్ స్టాలో పంచుకున్నారు సుధీర్ బాబు.

సుధీర్, ప్రియదర్శినిల పెళ్లి 2006లో మే 29న గ్రాండ్ గా జరిగింది. వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రియదర్శిని భర్త ఇండస్ట్రీలో ఫేమస్ హీరో అయినా అసలు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటుంది ప్రియదర్శిని.

కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. అలాగే కొద్ది రోజుల క్రితం తన సోదరి మంజుల ఘట్టమనేని యూట్యూబ్ ఛానల్లో స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.