
ఉంగరాల జుట్టు.. కట్టిపడేసే అందం.. టీనేజ్ లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళంతోపాటు మలయాళంలోనూ వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్.. దక్షిణాదిలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్. ప్రేమమ్ సినిమాతో సినీరంగంలోకి తెరంగేట్రం చేసిన ఆమె.. ప్రస్తుతం వరుస సినిమాలతో అలరిస్తుంది. ఇటీవలే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, కిష్కంధపురి, పరదా చిత్రాలతో అలరించింది.

ఈ ఏడాది వరుసగా హిట్స్ అందుకున్న అనుపమ.. మరోవైపు మరిన్ని అవకాశాలు అందుకుంటుంది. తమిళంలో ఆమె నటించిన బైసన్ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

అయితే కొన్నాళ్లుగా అనుపమ పేరు సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆమె హీరో ధృవ్ విక్రమ్ తో ప్రేమలో పడిందనే ప్రచారం నడించింది. చాలా రోజులుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని టాక్ రాగా.. ఇప్పటివరకు ఇద్దరు స్పందించలేదు.

ఇక ఇటీవలే మార్ఫింగ్ ఫోటోల బారిన పడింది అనుపమ. తమిళనాడుకు చెందిన ఓ 20 ఏళ్ల యువతి అనుపమ ఫోటోలను మార్ఫింగ్ చేసింది. తన పేరుతో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి తన ఫోటోస్, వీడియోస్ మార్ఫింగ్ చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.