
ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నటిగా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది. అటు సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట హీటెక్కిస్తుంది. తాజాగా 19 ఏళ్ల వయసులో ఆమె ఎలా ఉందో త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తనే బాలీవుడ్ బ్యూటీ శ్రేయా చౌదరి. బండిష్ బందిపోట్ల సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. తాజాగా సోషల్ మీడియాలో తన వెయిట్ లాస్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది.

కొన్నాళ్లపాటు ఆమె బరువు సమస్యతో ఎంతగా ఇబ్బందిపడిందో చెప్పుకొచ్చింది. 19 ఏళ్ల వయసులోనే ఆమె చాలా బరువు పెరిగింది. దీంతో డిస్క్ స్లిప్డ్‌తో బాధపడిందట. తనను తాను మార్చుకోవడానికి ఎంతగానో కష్టపడిందట.

19 ఏళ్ల వయసులోనే అధికంగా బరువు పెరగడంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని.. దీంతో తన ఆరోగ్యం సైతం పాడైందని చెప్పుకొచ్చింది. చిన్న వయసులోనే స్లిప్ డిస్క్ రావడంతో మరిన్ని సమస్యలతో పోరాడాల్సి వచ్చిందని తెలిపింది.

కానీ 21 సంవత్సరాలు వచ్చేసరికి తాను 30 కిలోల బరువు తగ్గానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తన ఫిట్నెస్, లుక్స్ పై దృష్టి పెట్టినట్లుగా తెలిపింది. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతుందని ఎదుర్కొని ముందుకు సాగాలని తెలిపింది.