
మీనాక్షి చౌదరి.. తెలుగులో తోపు హీరోయిన్. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత రవితేజతో ఖిలాడి చిత్రంలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆఫర్స్ మాత్రం ఆగలేదు.

ఆ తర్వాత హిట్ 2 సినిమాతో విజయాన్ని అందుకున్న మీనాక్షికి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో బ్యాక్ టూ బ్యా్క్ వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంది.

ఇటీవలే వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్ కలిసి నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కనిపించింది మీనాక్షి. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ అమ్మడి కెరీర్ దూసుకుపోతుందని అనుకున్నారు.

కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ బ్యూటీ సైలెంట్ అయ్యింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో చిన్న హీరోల సినిమాలు తప్ప పెద్ద హీరోల ఆఫర్స్ ఏమాత్రం రావడం లేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది ఈ బ్యూటీ.

అయితే మీనాక్షికి హైట్, శరీరాకృతే మైనస్ అయిందంటూ ప్రచారం నడుస్తోంది. హీరోయిన్స్ సగటు ఎత్తు కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది మీనాక్షి. దీంతో ఆమెకు ఆఫర్స్ తగ్గుతున్నాయని అంటున్నారు.