
ప్రస్తుతం బుల్లితెరపై బ్రహ్మముడి సీరియల్ అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతుంది. ఇందులో రాజ్, కావ్య పాత్రలతోపాటు అదే స్థాయిలో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది రుద్రాణి అత్త. ఈ పాత్రలో కన్నడ నటి షర్మిత గౌడ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సీరియల్ ద్వారా రుద్రాణి అత్త పాత్రలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. నెగిటివ్ పాత్రలో రఫ్పాడిస్తోంది. అలాగే చీరకట్టులో కనిపిస్తూనే గ్లామర్ లుక్లో టీవీ ప్రపంచంలో మాయ చేస్తుంది షర్మిత.

చిన్న వయసులోనే అత్త పాత్రలో నటిస్తున్న ఈ అమ్మడు.. అటు యాక్టింగ్.. ఇటు గ్లామర్ తో అదరగొట్టేస్తుంది. బ్రహ్మాముడి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది షర్మిత.

అలాగే అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పూల చీరలో ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఎ్రర రంగు పూల చీరలో గ్లామర్ లుక్ ఇస్తూ షర్మిత షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. షర్మిత వయసు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. కానీ చిన్న వయసులోనే అత్త పాత్రలలో నటిస్తుంది. ఇప్పటికే కన్నడలో అనేక సీరియల్స్ చేసింది.