
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన 'బోర్డర్ 2' సినిమా శుక్రవారం, జనవరి 23, 2026న థియేటర్లలో విడుదలైంది. నివేదికల ప్రకారం, 'బోర్డర్ 2' తొలి రోజు శుక్రవారం భారతదేశంలో మొత్తం 30 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తొలి రోజే ధురంధర్, సైయారా చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది.

ధురంధర్ మొదటి రోజు రూ. 28 కోట్లు వసూలు చేయగా.. సైయార్ మొదటి రోజు రూ. 21 కోట్లు వసూలు చేసింది. 'బోర్డర్ 2' ధురంధర్, సైయార్ రెండింటి రికార్డులను బద్దలు కొట్టింది. బోర్డర్ 1 హిట్ అయిన 27 సంవత్సరాల తర్వాత 'బోర్డర్ 2' విడుదలైంది.

ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేశారు. ప్రేక్షకులలో 'బోర్డర్ 2' కి విపరీతమైన క్రేజ్ ఉంది. ముందస్తు బుకింగ్‌ల ద్వారా (ప్రీ-సేల్స్) మాత్రమే ఇది రూ. 12.05 కోట్లు సంపాదించింది. ఇందులో భారతదేశం అంతటా 4,00,000 కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

బోర్డర్ 2 రెండవ రోజు కూడా ధురంధర్ రికార్డును బద్దలు కొట్టింది. నివేదిక ప్రకారం, బోర్డర్ 2 రెండవ రోజు రూ. 36.7 కోట్లు వసూలు చేసింది. ధురంధర్ రెండవ రోజు రూ. 32 కోట్లు వసూలు చేసింది. బోర్డర్ 2 ఇప్పటివరకు మొత్తం రూ. 66 కోట్లు వసూలు చేసింది.

అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన సన్నీ డియోల్ 'బోర్డర్'లో వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి కూడా కీలక పాత్రల్లో నటించారు. మోనా సింగ్, సోనమ్ బజ్వా, అన్య సింగ్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు.