
వాణీ కపూర్.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. నాని హీరోగా నటించిన ఆహా కళ్యాణం అనే సినిమాలో నటించింది ఈ చిన్నది. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కాగా ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటిస్తుంది.

ఈ వయ్యారి భామ 1988 ఆగస్టు 23న ఢిల్లీలో పుంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది. వాణీ టూరిజం స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసింది. వాణీ 2013లో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ శుద్ధ్ దేశీ రొమాన్స్తో హిందీ సినిమాల్లో అడుగుపెట్టింది.

ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, పరిణీతి చోప్రాతో కలిసి నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అరంగేట్రం అవార్డు అందుకుంది. ఆతర్వాత ఈ చిన్నదానికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.

2014లో తెలుగులో ఆహా కళ్యాణం చిత్రంతో అడుగుపెట్టింది, ఇది హిందీ చిత్రం బ్యాండ్ బాజా బారాత్ రీమేక్. నానితో కలిసి నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ ఈ సినిమా తర్వాత వాణి తెలుగులో చేయలేదు.

వాణీ కపూర్ తన కెరీర్‌లో ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ, తన నటనా నైపుణ్యంతో బాలీవుడ్‌లో స్థానం సంపాదించుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.